G.V.REDDY

CELL: +91 9908480326

Tuesday, June 12, 2018

అప్పుడే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ Big boos 2 telugu

Image result for bigg boss 2 telugu
మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌ భారీ అంచనాల నడుమ ప్రారంభం అయ్యింది. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌గా హోస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. కాని రెండవ సీజన్‌కు మాత్రం నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. హోస్ట్‌ విషయంలో నిరాశ పర్చిన స్టార్‌మా తాజాగా పార్టిసిపెంట్స్‌ విషయంలో కూడా తీవ్రంగా నిరాశ పర్చారు. హౌస్‌లోకి వెళ్లిన 16 మందిలో కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే నోటెడ్‌ సెలబ్రెటీలు. మిగిలిన వారు అంతా కూడా ఎవరో, ఏంటో తెలియదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మొదటి రోజే పూర్తిగా డిస్సపాయింట్‌ చేసింది. సామాన్యులకు ఛాన్స్‌ అంటూ కేవలం ముగ్గురిని మాత్రమే తీసుకున్న స్టార్‌ మా వారు 13 మంది సెలబ్రెటీల్లో మంచి గుర్తింపు ఉన్న వారిని ఎక్కువగా తీసుకోలేదు. బిగ్‌బాస్‌ 2లో గీతామాధురి, తేజస్వి, శ్యామల మినహా మిగిలిన ఎవరు కూడా పెద్దగా తెలియని వారే అవ్వడంతో ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు.   ప్రేక్షకులు ప్రస్తుతానికి అసంతృప్తితో ఉన్నా కూడా షో ముందు ముందు మంచి ఆసక్తికరంగా సాగుతుందనే నమ్మకంను స్టార్‌ మా వారు చెబుతున్నారు. ఇక సెలబ్రెటీలు లేరు అంటూ మొత్తుకుంటున్న ప్రేక్షకుల కోసం ముగ్గురు స్టార్స్‌ను రంగంలోకి దించేందుకు షో నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొదటగా ‘కంచె’ చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరిని అలరించిన ప్రగ్యాజైస్వాల్‌. ఈ అమ్మడు రెండవ వారంలో బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక మరో ప్రముఖ కమెడియన్‌ మరియు ఒక హీరోయిన్‌ను కూడా రంగంలోకి దించాలని స్టార్‌ మా నిర్ణయించుకుంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అయిన షోకు పాజిటివ్‌ బజ్‌ను తీసుకు రావాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Share:

0 comments:

Post a Comment

google ads

2222222

01

Definition List

5/Cars/feat-tab

Unordered List

4/Cars/post-per-tag

Support

5/slider-recent