హైదరాబాద్ : 2016 సంవత్సరం అప్పుడే హాఫ్ ఇయిర్ దాటి రెండో అర్దం జరిగిపోతోంది. ఈ నేపధ్యంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో హిట్స్ ఇంతకు ముందు చూసాం. అయితే ఈ సంవత్సరం బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. సంవత్సరం ప్రారంభం హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో ఉత్సాహం తెస్తే తర్వాత పెద్ద సినిమాలన్ని ఢమాల్ అనటం మొదలెట్టి అందరినీ భయపెట్టాయి. అయితే బిచ్చగాడు, మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరత్ చిత్రాలు కలెక్షన్స్ చూస్తూంటే ఈ పెద్ద సినిమాలు సిగ్గు పడేలా ఉన్నాయి. ఎందుకంటే వీటిల్లో స్టార్స్ లేరు.
ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమా హిట్..ఫ్లాఫ్ అనే దానికి కొలమానం కేవలం కలెక్షన్సే. భారీ కలెక్షన్లు రావడం వల్ల సినిమా తీసిన నిర్మాతతోపాటు ఆ సినిమాని కొన్న బయ్యర్లు, దాని డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ లాభపడటంతో కలెక్షన్లే నేటి సినిమాల సక్సెస్‌కి కొలమానమైంది. మరో ప్రక్క ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసినా ఎంటర్‌టైన్ చేయని సినిమా ప్రేక్షకుడి దృష్టిలో బిగ్గెస్ట్ డిజాస్టరే అంటున్నారు. దానికి ఉదాహరణగా.. ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'కబాలి' ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది. అయితేనేం...సినిమా బాగోలేదనే టాక్ తెచ్చుకుంది. చూసిన చాలా మంది ప్రేక్షకులు పెదివి విరిచారు. ఏమీలేదని తేల్చేసారు. ఒక్కమాటలో చెప్పాలంటే కథాపరంగా చూస్తే 'కబాలి' బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తేల్చారు

0 comments:
Post a Comment