హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఒక సినిమా మొదలవ్వడానికి ముందు వ్యవహారాలన్నీ దాదాపుగా నమ్మకం మీదనే కొనసాగుతుంటాయి. ఒక స్టార్ హీరో లేదా డైరెక్టర్ ఒక నిర్మాతకు సినిమా చేస్తానని మాట ఇవ్వడం, వారిపై నమ్మకంతో నిర్మాత వారికి కొంత అడ్వాన్సుగా కొంత డబ్బు ఇవ్వడం సర్వసాధారణంగా జరిగే వ్యవహారాలే.. ఇలా అడ్వాన్స్ ఇచ్చే వషయంలో ఎలాంటి పేపర్ అగ్రిమెంట్లు ఏమీ ఉండవు, కేవలం నమ్మకం మీదే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అగ్రిమెంట్లు అయిందంటే సినిమా మొదలవుతుందని అర్థం. చాలా మంది హీరోలు, దర్శకులు తమ మాట నిలబెట్టుకోవడానికి వంద శాతం ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో హీరోలు, దర్శకులు అంతకంటే బెటర్ ఆఫర్స్ వచ్చినా తమ మాట నిలబెట్టుకునే ప్రతయ్నం చేస్తారు. ఒక వేళ నిర్మాత తనకు తానుగా ఆర్థిక ఇబ్బందులతో సినిమాను ఆపేస్తే తప్ప ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండదు. అయితే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఓ స్టార్ హీరో (పేరు బయట పెడితే గొడవలైపోతాయ్) కావాలనే నిర్మాతలతో ఆడుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. వారితో సినిమాలు చేస్తానని భారీగా డబ్బు అడ్వాన్సుగా తీసుకోవడం, నెలలు, కొన్ని సార్లు సంవత్సరాలు ఆ డబ్బును తన ఫైనాన్షియల్ అవసరాలకు వాడుకోవడం, తర్వాత బెటర్ ఆఫర్ రాగానే పాత నిర్మాతకు టాటా చెప్పేయడం లాంటివి చేస్తున్నాడట.
Thursday, July 28, 2016
Home »
» నిర్మాతలను కొత్తగా మోసం చేస్తున్నాడు: ఎవరా తెలుగు స్టార్ హీరో
0 comments:
Post a Comment