విండోస్10లో మెసెంజర్ బీటా వెర్షన్ విడుదల

కాలిఫోర్నియా : విండోస్10 ఆపరేటింగ్ సిస్టం గల కొన్ని మొబైల్ పరికరాల్లో ఎట్టకేలకు ఫేస్‌బుక్ మెసెంజర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం బీటా వెర్షన్ మాత్రమే శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇంకా అన్ని విండోస్ 10 మొబైల్ డివైజ్‌లకూ ఈ అప్లికేషన్ చేరలేదు. ఈ విషయమై సంస్థ అధికారి ఒకరు మాట్లాడుతూ.. కొన్ని దేశాల్లో పది శాతం మంది ప్రజలకు మాత్రమే మెసెంజర్ బీటా వెర్షన్ అప్లికేషన్‌ని పంపించామన్నారు. ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించిన తరువాత అన్ని విండోస్ 10 డివైజ్‌లకూ దీన్ని పంపిస్తామని చెప్పారు.
0 comments:
Post a Comment