G.V.REDDY

CELL: +91 9908480326

Friday, March 18, 2016

ఈ సారైనా తెలుగులో కొడతాడా..?

ఈ సారైనా తెలుగులో కొడతాడా..?
కింగ్ ఖాన్.. బాద్షా ఆఫ్ బాలీవుడ్.. ఇలా ఎన్నో ముద్దుపేర్లు ఆ హీరోకు. ఆయనే షారుక్ ఖాన్. దేశం, విదేశం అనే తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల సునామీ సృష్టించగల సత్తా ఉన్న హీరో షారుక్. ఇన్నాళ్లూ కేవలం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడంతో రీజినల్ లాంగ్వేజెస్ లో షారుక్ సినిమాలకు పెద్దగా పట్టులేదు. ఇక్కడ కింగ్ ఖాన్ సినిమాలు ఎప్పుడొస్తున్నాయో ఎప్పుడెళ్తాయో కూడా క్లారిటీ లేదు. దాంతో ఇన్నేళ్ళ తర్వాత తెలుగు మార్కెట్ పై కన్నేసాడు కింగ్ ఖాన్. తాజాగా నటిస్తున్న ఫ్యాన్ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నాడు షారుక్.

మనీష్ శర్మ తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇందులో హీరోగా, ఫ్యాన్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు షారుక్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ప్రోమోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో ఏడు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే అన్ని భాషల్లో ప్రమోషన్ కూడా మొదలుపెట్టేసారు దర్శకనిర్మాతలు. తెలుగు విషయానికొస్తే ఈ మధ్యే విడుదలైన ఫ్యాన్ తెలుగు సాంగ్ ఆకట్టుకుంటుంది. నకాశ్ అజీజ్ పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగానే రీచ్ అవుతుంది.

గతంలో తెలుగు ప్రేక్షకులను నాలుగుసార్లు పలకరించాడు షారుక్. అప్పట్లో రెండు దశాబ్దాల కింద డిడిఎల్జేతో తొలిసారి.. మణిరత్నం దిల్ సేతో రెండోసారి.. రా.వన్ తో మూడోసారి.. హ్యాపీ న్యూ ఇయర్ తో మరోసారి తన సినిమాలను తెలుగులో డబ్ చేసాడు షారుక్. తొలి ప్రయత్నంలో మినహా మిగిలిన అన్నిసార్లు షారుక్ కు ఇక్కడ పరాభవమే ఎదురైంది. ఈ సారి ఫ్యాన్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు కింగ్ ఖాన్. మరి చూడాలి.. ఈ సారైనా షారుక్ తెలుగులో తన మార్కెట్ ఓపెన్ చేసకుంటాడో లేదో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14167/Can-Sharukh-gets-a-Hit-from-Fan-In-Telugu#sthash.AnJZ1kYW.dpuf
Share:

0 comments:

Post a Comment

google ads

2222222

01

Blog Archive

Definition List

5/Cars/feat-tab

Unordered List

4/Cars/post-per-tag

Support

5/slider-recent