G.V.REDDY

CELL: +91 9908480326

Wednesday, March 16, 2016

* నీ జీవితం విలువ.... ?

* నీ జీవితం విలువ.... ?
ఒక వ్యేక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఏంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.
కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు....
ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.
" You Are More Important Than You Realize...."
"Yes.... You Are So Beautiful Because God Made You...."
Share:

0 comments:

Post a Comment

google ads

2222222

01

Blog Archive

Definition List

5/Cars/feat-tab

Unordered List

4/Cars/post-per-tag

Support

5/slider-recent