అలాంటి వాళ్లు నేనేం చేసినా తప్పుపడతారు: ఆమీర్‌ఖాన్

ముంబయి:
తనపై వ్యతిరేకత ఉన్న వ్యక్తులు తానేం చేసినా తప్పుపడతారని, ప్రశ్నిస్తారని బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ అన్నారు. ఇటీవల అసహనంపై వ్యాఖ్యలు చేసి ఆమీర్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై ప్రస్తావించారు.
సినిమాల ద్వారా దాదాపు 27ఏళ్లుగా అభిమానులతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. తానేంటో వారందరికీ తెలుసని ఆమీర్ అన్నారు. ఎవరైతే తనపై తప్పుడు వ్యాఖ్యలు చేశారో.. వారంతా తనపై వ్యతిరేక భావాన్ని ముందుగానే ఏర్పరుచుకున్నవారేనని అభిప్రాయపడ్డారు. అలాంటి వారికి తానేంచేసినా తప్పుగానే కన్పిస్తుందన్నారు. తన దృష్టిలో దేశంపై గౌరవం అంటే సమాజానికి సేవ చేయడమేనని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి సాయం వారి జీవితాలను బాగు చేయడమే నిజమైన దేశభక్తని చెప్పుకొచ్చారు.
తనకు గానీ, తన భార్యకు గానీ దేశం విడిచి వెళ్లే ఉద్దేశం లేదని ఆమీర్ స్పష్టం చేశారు.
by
gvr groups
0 comments:
Post a Comment